The Q News office of MLC Teenmar Mallanna, located in Medipalli, Hyderabad, was attacked.
హైదరాబాద్‌లోని మేడిపల్లిలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగింది. జాగృతి కార్యకర్తలు, ఎమ్మెల్సీ కవిత అనుచరులు దాడి చేసినట్టు చెబుతున్నారు. ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నంలో మల్లన్న గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొందిజాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయంలోకి చొరబడి భారీ విధ్వంసం సృష్టించారు. ఆఫీస్‌లోని ఫర్నీచర్, టేబుళ్లు, కుర్చీలను సైతం ధ్వంసం చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా ఆఫీస్ గదుల్లో నేలపై రక్తపు మరకలు కూడా కనిపించాయి. అయితే ఘటన జరిగిన సమయంలో ఆఫీస్‌లో మల్లన్నతో పాటు ఆయన అనుచరులు కూడా ఉన్నట్లు సమాచారం. దాడి ఉదృతంగా మారడాన్ని గమనించిన మల్లన్నకు రక్షణగా ఉన్న గన్‌మెన్, పరిస్థితిని అదుపు చేయడానికి గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.
#TheenMarMallanna
#Kavitha
#MLCKavitha
#Telangana
#BRS
#Congress
Also Read
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు లేఖ :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-writes-a-letter-of-complaint-to-the-legislative-council-chairman-regarding-teenmar-malla-443379.html?ref=DMDesc
హామీలు గాలికొదిలారా?.. కాంగ్రెస్‌పై కవిత పోస్ట్‌కార్డుల యుద్ధం :: https://telugu.oneindia.com/news/telangana/kavitha-leads-postcard-campaign-criticizes-over-unfulfilled-congress-promises-443247.html?ref=DMDesc
బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్.. జాగృతి విజయమే: ఎమ్మెల్సీ కవిత :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-calls-bc-reservations-ordinance-a-victory-of-telangana-jagruthi-443095.html?ref=DMDesc
~VR.238~HT.286~